: రెండు స్థానాల బరిలో ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి, అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. తమ సొంత నియోజకవర్గమైన గందేర్బల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయకుండా, సోన్ వార్, బీర్వా నియోజక వర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నారు. కాగా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై విజయం సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.