: సెల్ఫీలో ఊహకందని అతిథి!


సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో సెల్ఫీలు ఇప్పుడు తాజా ట్రెండ్. ఏ పని చేసినా, ఎవర్ని కలిసినా ఓ సెల్ఫీ పడాల్సిందే. అయితే, ఓ సెల్ఫీ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందట. విక్టోరియా గ్రీవెస్ (22), కేలీ ఆట్కిన్సన్ (23) స్నేహితులు. లండన్ లోని న్యూకేజిల్ లోని ఓ బార్ లో రెండు పెగ్గులు పుచ్చుకుని సెల్ఫీ తీసుకున్నారు. అందులో ఊహించని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. సెల్ఫీలో ఓ వృద్ధ మహిళ కనిపించింది. కొందరు దాన్ని దయ్యం అని భావిస్తున్నారట. ఆ ఫోటోని స్నాప్ ఛాట్ లో అప్ లోడ్ చేశారు. అయితే, తమ ఫోన్లలోంచి మాత్రం దాన్ని డిలీట్ చేశారు. ఇప్పుడా సెల్ఫీ సోషల్ మీడియాలో చాలా పెద్ద టాపిక్ అయిపోయింది.

  • Loading...

More Telugu News