: సర్దార్ వల్లభాయ్ వాడిన వస్తువులను స్వీకరించిన ప్రధాని
సర్దార్ వల్లభాయ్ పటేల్ వాడిన వస్తువులను ప్రధాని నరేంద్ర మోదీ స్వీకరించారు. ఢిల్లీలో మంజిరి ట్రస్ట్ కు చెందిన షీలా ఘటాటే అనే మహిళ ప్రధానికి వల్లభాయ్ వస్తువులను అప్పగించారు. ఆ వస్తువుల్లో ప్లేట్లు, కప్పులు, సాసర్లు వంటి వస్తువులున్నాయి. పటేల్ మునిమనవడు బిపిన్ దహ్యాభాయ్ దంపతులు రాసిన విల్లు ద్వారా ఈ వస్తువులు ఘటాటేకు సంక్రమించాయి. వీటిని అందుకున్న ప్రధాని మోదీ సంబరపడిపోయారు. వీటిని 'భారతీయ వారసత్వ సంపద' అని అభివర్ణించారు. వాటిని భద్రపరిచేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.