: తెలంగాణ రాష్ట్రానికి 'ఇండియా టుడే' అవార్డు


'ఇండియా టుడే' సంస్థ ప్రతి ఏటా ఇచ్చే 'ది స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' పురస్కారాల్లో తెలంగాణరాష్ట్రం ఓ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకుంది. మౌలిక వసతుల కల్పనలో దేశంలోనే అగ్రగామిగా ఉందంటూ 'బెస్ట్ అచీవ్ మెంట్ అవార్డు'కు ఇండియా టుడే సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పంచాయతీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం చేయూతనిస్తే రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలంగాణలో కరెంట్ సమస్యకు చంద్రబాబే కారణమని విమర్శించారు. విభజన చట్టానికి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు. కరెంట్ విషయంలో టీటీడీపీ నేతలు ముందు చంద్రబాబును నిలదీసి ఆ తర్వాత తమను ప్రశ్నించాలన్నారు.

  • Loading...

More Telugu News