: యూనియన్ కార్బైడ్ కంపెనీ మాజీ చైర్మన్ వారెన్ మృతి
అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వారెన్ ఎం ఆండర్సన్ (92) మృతి చెందారు. ఈ నెల 29న ఫ్లోరిడాలోని వెరొ బీచ్ నర్సింగ్ హోమ్ లో ఆయన చనిపోయినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. అయితే, ఆయన మరణం గురించి కుటుంబ సభ్యులెవరూ ప్రకటించలేదని తెలిపింది. 1984, డిసెంబర్ 2,3 తేదీల్లో భోపాల్ లో యూనియన్ కార్బైడ్ కంపెనీ ప్లాంటు నుంచి విషవాయువు లీకై ఐదు వేల మందికి పైగా చనిపోయారు. ఆ సమయంలో ఆ కంపెనీకి ఆయనే చైర్మన్!