: సంస్థానాలు విలీనమయ్యాయంటే అది పటేల్ ఘనతే: మోదీ


సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ప్రసంగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సంస్థానాలు విలీనమయ్యాయంటే అది పటేల్ సత్తాకు నిదర్శనమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వస్తే భారత్ విచ్ఛిన్నమైపోతుందని బ్రిటీష్ వారు భావించారని, అయితే, పటేల్ దేశాన్నంతటినీ ఏకతాటిపై నిలిపారని మోదీ గుర్తు చేశారు. తన దృఢసంకల్పంతో సంస్థానాధీశుల మెడలు వంచారని తెలిపారు. ఆయన జీవితం దేశం కోసమే అంకితమైందని అన్నారు. 'దండి' యాత్రలో గాంధీతో కలిసి నడిచిన వ్యక్తి పటేల్ అని తెలిపారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్న ప్రధాని, ఆ స్ఫూర్తిని అందుకుని నవ్యోత్సాహంతో ముందుకెళ్ళాలని జాతికి పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News