: బీజేపీలోకి చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్?


ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరవచ్చని తెలుస్తోంది. గత ఎన్నికలలో చీరాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కృష్ణమోహన్ గెలిచారు. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరాలనుకున్నారు. దీనికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే, ఆయన చేరిక పట్ల... చీరాలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన పోతుల సునీతతో పాటు జిల్లాకు చెందిన కీలక నేతలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ కారణంగా, ఆఖరి నిమిషంలో కృష్ణమోహన్ ను పార్టీలోకి తీసుకునేందుకు చంద్రబాబు వెనకడుగు వేశారు. దీంతో, తాజాగా ఆయన బీజేపీ లోకి వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు, ఆయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన బీజేపీ అగ్రనాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News