: సీబీఐ జేడీని మార్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్


జగన్ అక్రమాస్తుల కేసులో దర్యాప్తు పూర్తయ్యే వరకు సీబీఐ జేడీగా లక్ష్మీనారాయణే కొనసాగేలా ఆదేశించాలని శ్రీరంగరావు అనే న్యాయవాది హైకోర్టులో నేడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేగాకుండా హైకోర్టు పర్యవేక్షణలో జగన్ కేసు విచారణ జరపాలని కూడా పిటిషనర్ పేర్కొన్నారు. 2జీ కేసులో మాదిరి హైకోర్టు నిరంతరం ఈ కేసును పర్యవేక్షించాలని ఆయన తన పిటిషన్ లో సూచించారు. ఇక ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లను కోర్టు పరిశీలించాలని శ్రీరంగరావు కోరారు.

జగన్ అవినీతి కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ జేడీని బదిలీ చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించిన నేపథ్యంలో తాజా పిటిషన్ దాఖలవడం గమనార్హం.

  • Loading...

More Telugu News