: గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయిగా, అందుకే ఆంధ్రావారిపై కేసీఆర్ 'లవ్': ఏపీ మంత్రి


ఏపీ కేబినెట్ సమావేశంలో మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. హైదరాబాద్ లో స్థిరపడిన ఆంధ్రావాళ్లు కూడా తెలంగాణ బిడ్డలే అని నిన్న కేసీఆర్ వ్యాఖ్యానించడం పట్ట కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి దాకా, ఆంధ్రా వాళ్లంతా దొంగలు, దోపిడీ దారులు, భూకబ్జాదారులు అని విరుచుకుపడిన కేసీఆర్...హఠాత్తుగా ఆంధ్రావాళ్ల మీద ఇంత ప్రేమ కురిపించడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఓ మంత్రి సమావేశంలో ప్రశ్నించారు. ''గ్రేటర్ ఎన్నికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు కేసీఆర్ నోటి నుంచి అలాంటి మాటలే వస్తాయి'' అని మరో మంత్రి సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలకు చంద్రబాబు స్పందిస్తూ ''ఆయన పూటకో మాట మాట్లాడతారు. నిన్నటిదాకా ఇతర ప్రాంతాల వారిపై అనవసరంగా నోరు పారేసుకున్నారు. దీంతో, హైదరాబాద్ కు పెట్టుబడులు రావడం తగ్గిపోతున్నాయని ఆయనకు అర్ధమైంది. అందుకే, ఇప్పుడు ఇలా కొత్త పల్లవి అందుకున్నారు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News