: గుంటూరు, ప్రకాశం జిల్లాలలో భూప్రకంపనలు
గుంటూరు జిల్లా అమరావతికి కూతవేటు దూరంలోని పలు మండలాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వినుకొండ, శావల్యాపురంలోని ఏనుగుపాలెం, కారుమంచి, వయకల్లు, మతుకుమల్లి, ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలంలోని పలు గ్రామాల్లో కొద్దిపాటి శబ్దంతో వచ్చిన భూప్రకంపనలతో ఇళ్లలోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లలోంచి భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వస్తుందేమోనన్న భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బయటే గడుపుతున్నారు.