: ఉద్యోగుల విభజనకు 19 పేజీల మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉద్యోగుల విభజనకు కమల్ నాధన్ కమిటీ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఉద్యోగుల విభజనకు సంబంధించిన మార్గదర్శకాలను కమిటీ విడుదల చేసింది. 19 పేజీల మార్గదర్శకాలను కమిటీ తన వెబ్ సైట్ లో ఉంచింది. 2014 జూన్ 1 వరకు ఆయా ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా విభజించినట్టు కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఉద్యోగులంతా ఆప్షన్లు ఇవ్వవచ్చని కమిటీ సూచించింది.