: అప్పుడు టీడీపీ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పార్టీ అవుతుంది: లోకేష్


25 లక్షల మంది పార్టీలో చేరితే ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరిస్తుందని టీడీపీ కార్యకర్తల సంక్షేమ విభాగం సమన్వయకర్త నారా లోకేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నవంబర్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నామని అన్నారు. డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు తమిళనాడు, కర్నాటక, కేరళ, అండమాన్&నికోబార్ దీవుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని ఆయన వివరించారు. పార్టీ సభ్యత్వ రుసుము కేవలం 10 రూపాయలని తెలిపిన ఆయన, క్రియాశీలక సభ్యత్వానికి 100 రూపాయలను ఎంట్రీ ఫీజుగా నిర్దేశించినట్టు తెలిపారు. టీడీపీ కార్యకర్తలందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News