: సరసమైన ధరకే డ్రైవర్ రహిత కార్లు!


రానున్న పదేళ్లలో డ్రైవర్ లేకుండా నడిచే కార్లు సామాన్యులకూ అందుబాటులోకి వస్తాయని ఆస్ట్రేలియన్ పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రైవర్ రహిత కారును ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ బా తుంగ్ వో బృందం రూపొందించింది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ కారును ఆయన ప్రయోగాత్మకంగా రోడ్లపై పరుగులు తీయిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది రోడ్డు, చుట్టూ ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుని పరుగులు తీస్తోందని ఆయన మురిసిపోతున్నారు. తరువాతి దశలో, దీనిని కంప్యూటర్ కు అనుసంధానించడం ద్వారా నిర్దేశిత గమ్యం చేరుకునేలా చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు రాడార్లు, సెన్సర్లు, లేజర్ పరికరాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. ఇలాంటి కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ధర చుక్కలను తాకుతోందని, ఆ ధరను మరింత కిందికి దించి డ్రైవర్ రహిత కారును సరసమైన ధరలో అందరికీ అందుబాటులోకి తేవాలన్నదే తమ ప్రయత్నమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే పదేళ్లలో అలాంటి కార్లు అందరికీ అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News