: మద్దతిస్తానని ముందుకొచ్చిన ఎన్సీపీ అప్పుడే విమర్శలు ప్రారంభించింది!
నిన్నటి వరకు అధికారం చేపట్టడంలో సహకరిస్తాం, మద్దతిస్తామంటూ మహారాష్ట్రలో బీజేపీ వెంటపడిన ఎన్సీపీ తాజాగా విమర్శలను ప్రారంభించింది. రేపు జరగనున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆర్భాటం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎన్సీపీ ఆరోపించింది. మహారాష్ట్ర చరిత్రలోనే ప్రమాణ స్వీకారం కోసం బీజేపీ పెద్ద ఎత్తున ధనాన్ని వెచ్చిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు.