: డీలాపడిపోయిన కేరళ బార్ యజమానులు
కేరళ ప్రభుత్వ మద్యం విధానంపై హైకోర్టులోనైనా తమకు ఊరట లభిస్తుందని భావించిన అక్కడి బార్ యాజమాన్యాలకు నిరాశ తప్పలేదు. తాజా మద్యం పాలసీ ప్రకారం... మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటళ్ళు, ప్రభుత్వ రిటైల్ దుకాణాల్లోనూ విక్రయిస్తారు. ఈ విధానం పట్ల కేరళలోని బార్ యజమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే, తామిక బార్లు మూసివేయక తప్పదంటూ, వారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సర్కారు కొత్త ఎక్సైజ్ పాలసీని సమర్థించింది. తద్వారా, ప్రైవేటు వ్యక్తులు ఇకపై కేరళలో మద్యం అమ్మడం నిషిద్ధం.