: మీకు దమ్ముంటే ఆ పేర్లు బయటపెట్టండి: దిగ్విజయ్ సింగ్ సవాల్


కేంద్రానికి దమ్ముంటే నల్లకుబేరుల పేర్లు బయటపెట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సవాలు విసిరారు. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో కల్కి మహోత్సవాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వంద రోజుల్లో నల్లధనం వెనక్కి రప్పించి, ప్రతి వ్యక్తి ఖాతాలో మూడు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పిన వ్యాఖ్యల్ని అమలు చేేయడంలో బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారని అన్నారు. కేంద్రానికి కాస్తయినా ధైర్యముంటే విదేశీ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి ఖాతాల వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. జన్ ధన్ యోజన కోసం తాము ఓపెన్ చేసిన బ్యాంకు అకౌంట్ వివరాలు ప్రధానికి పంపి, ఆ అకౌంట్లో ఆ మొత్తం జమ చేయమని ప్రజలు డిమాండ్ చేయాలని డిగ్గీరాజా పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News