: 200 మంది సజీవ సమాధి... శ్రీలంకలో విషాదం


శ్రీలంకలో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. శ్రీలంకలోని సెంట్రల్ బదుల్లా జిల్లాలోని మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో, సుమారు 200 మంది వాటి కిందపడి సజీవ సమాధి అయ్యారని విపత్తు నిర్వహణాధికారి ప్రదీప్ కొదిప్పిలి తెలిపారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, పోలీసు బృందాలు సహాయకచర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఇంకా 500 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని తెలుస్తోంది. 817 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, మెర్రిబెడ్డా టీ ఎస్టేట్ ప్రాంతంలో భారత సంతతి కార్మికులు ఎక్కువగా ఉంటారు.

  • Loading...

More Telugu News