: ముగిసిన ఏపీ మంత్రివర్గ సమావేశం


ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీ 5 గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది. ప్రధానంగా శ్రీశైలం జలవివాదంపై చర్చించారు. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణయం వెల్లడికాలేదు. జూన్ 2ను రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి 11 వరకు జన్మభూమి నిర్వహించాలని నిర్ణయించారు. రాజధానికి భూసేకరణపై ఉపసంఘం నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. హుదూద్ తుపానుపైనా క్యాబినెట్ భేటీలో చర్చించారు. తిరుమలలో అన్యమత ప్రచారంపై ఈ సమావేశంలో ఆగ్రహం వ్యక్తమైంది. కాగా, ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనల వివరాలను క్యాబినెట్ కు తెలిపారు. నవంబర్ 13 నుంచి 15 వరకు మలేసియా, సింగపూర్ లో బాబు పర్యటిస్తారు. అనంతరం, నవంబర్ 23 నుంచి 28 వరకు జపాన్ లో పర్యటిస్తారు.

  • Loading...

More Telugu News