: రేపు ముంబయి వెళుతున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ముంబయి వెళుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం ఆహ్వానం మేరకు... మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హజరుకానున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ కార్యక్రమం భారీస్థాయిలో జరగనున్న సంగతి తెలిసిందే.