: ఐఐటీ, ఐఐఎంలలో వెజ్, నాన్ వెజ్ కు వేర్వేరు క్యాంటీన్లు!


దేశంలో పేరెన్నికగన్న ఐఐటీ, ఐఐఎంలలో ఇకపై శాకాహారులు, మాంసాహారులకు వేర్వేరుగా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ఐఐటీలు, ఐఐఎంలకు లేఖ రాసింది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో వేర్వేరు మెస్ లు ఏర్పాటు చేయాలంటూ ఓ వర్గం రాసిన ఐదు లేఖలను కూడా తన లేఖతో పాటు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పంపించింది. కాగా, బాంబే ఐఐటీలో నాన్-వెజ్ కూడా వండుతున్నా, ఒకే మెస్ లో వడ్డిస్తున్నారు. కామన్ మెస్ లో మాంసాహారులతో కలసి భోజనం చేసేందుకు శాకాహారులు ఇబ్బంది పడతారని ఆ లేఖల్లో పేర్కొన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, కొన్ని క్యాంపస్ లకు చెందిన విద్యార్థులు తామేమీ అసౌకర్యానికి గురికావడం లేదని తెలపడం గమనార్హం.

  • Loading...

More Telugu News