: చంద్రబాబు కార్యాలయం ఓఎస్డీగా వెంకయ్య చౌదరి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయం (సీఎంఓ) ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు జారీ చేశారు. రెండేళ్ల పాటు ఈయన ఓఎస్డీ పదవిలో కొనసాగనున్నారు. వెంకయ్య చౌదరి 2005 బ్యాచ్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం హైదరాబాదులోని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ లో డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక శిక్షణాకార్యక్రమంలో కూడా ఈయన పాల్గొన్నారు.