: విద్యార్థి బుగ్గ గిల్లిన టీచర్ కు భారీ జరిమానా


చెన్నైలో ఓ విద్యార్థి బుగ్గ గిల్లిన టీచర్ కు మద్రాస్ హైకోర్టు భారీ జరిమానా విధించింది. ఆ వివరాల్లోకెళితే... 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాల టీచర్ మెహరున్నీసా ఓ విద్యార్థిని దండించే క్రమంలో బుగ్గ గిల్లింది. దాంతో, ఆ విద్యార్థి తల్లి ఈ ఘటనను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. 2013లో కమిషన్ దీనిపై విచారణ జరిపి నిబంధనలు అతిక్రమించిందంటూ పాఠశాలకు రూ.1000 జరిమానా విధించింది. అదే సమయంలో విద్యార్థి తల్లి పాఠశాలను టీసీ (ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్) కావాలని కోరింది. బాలుడికి టీసీ ఇవ్వడంలో స్కూలు వారు జాప్యం చేశారు. ఘటనలో సరైన న్యాయం జరగలేదన్న ఆవేదనతో పాటు, టీసీ ఇవ్వడంలో పాఠశాల వైఖరి విద్యార్థి తల్లిని హైకోర్టు దిశగా నడిపించాయి. అంతేగాకుండా, సైదాపేట మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ ఆమె ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. అటు, తనను పలు విధాలా వేధిస్తున్నారంటూ టీచర్ మెహరున్నీసా కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసు కింది కోర్టులో పెండింగ్ లో ఉందని, అక్కడకు వెళ్ళాలని సూచించింది. అంతేగాకుండా, ఆమెపై వచ్చి ఆరోపణలన్నింటిపైనా రూ.50000 జరిమానాగా చెల్లించాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News