: డిసెంబర్ 23న 'సత్యం' కేసు తుది తీర్పు
కొన్నేళ్లుగా కొనసాగుతున్న సత్యం కంప్యూటర్స్ కేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు కేసును విచారించిన ప్రత్యేక కోర్టు తుది తీర్పు తేదీని ప్రకటించింది. డిసెంబర్ 23న తుది తీర్పును వెల్లడిస్తామని తెలిపింది. దీంతో, రామలింగరాజు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురి తలరాతలు డిసెంబర్ 23న తేలిపోనున్నాయి.