: బయటి నుంచి మద్దతొస్తే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోండి: సుప్రీం


దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సుముఖత తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలన్న ఆప్ పిటిషన్ పై కోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రపతి సూచన మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేస్తున్న ప్రయత్నాలను న్యాయస్థానం సమర్థించింది. ఆయన చర్యలు సానుకూలంగా ఉన్నాయని పేర్కొంది. బయటి నుంచి ఎవరైనా మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని పేర్కొంది. అందుకోసం సంఖ్యాబలం తక్కువ ఉన్న పార్టీ మద్దతుకోసం ఎదురు చూడాలని చెప్పింది. తదుపరి విచారణను కోర్టు నవంబరు 11కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News