: గాజాలో ఐరాస పాఠశాలల పునర్నిర్మాణానికి మలాల విరాళం


ఇటీవల గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కట్టడాలు భారీ సంఖ్యలో నేలమట్టమయ్యాయి. సుమారు రెండు వేలమంది మరణించగా, అత్యధిక స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ఈ క్రమంలో అక్కడ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలను పునర్నిర్మించేందుకు పాకిస్థాన్ హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మలాల యూసుఫ్ జాయ్ 50,000 డాలర్ల (30,72,000)ను విరాళంగా ప్రకటించింది. "పాలస్తీనా బాలలు, బాలికలకు సరైన వాతావరణంలో మంచి విద్య అందించేందుకు హామీ ఇస్తున్నాం. విద్య లేకుండా శాంతిని నెలకొల్పలేము" అని ఆమె పేర్కొంది. ఇదిలా ఉంచితే, ఐక్యరాజ్యసమితి అందించే రిలీఫ్ ఫండ్ పాలస్తీనాలో 65 పాఠశాలలను నిర్మించేందుకు సహాయపడుతుంది.

  • Loading...

More Telugu News