: రెండు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రేమాభిమానాలతో కలసిమెలిసి ఉండాలి: డీఎస్
మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో పాటు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలందరూ ప్రేమాభిమానాలతో కలసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకుంటూ, రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.