: జగన్ అతి విశ్వాసమే కొంప ముంచిందన్న ఆయన మేనమామ
వైకాపా అధినేత జగన్ మేనమామ, ఆ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తామన్న జగన్ అతి విశ్వాసమే పార్టీ కొంప ముంచిందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని... అందుకే, ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయామని... 4 వేల ఓట్ల తేడాతో 25 నియోజకవర్గాల్లో ఓటమి చెందామని అన్నారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ఆయన ఈ విధంగా స్పందించారు.