: కుల వివాదంలో అరకు ఎంపీకి హైకోర్టు నోటీసులు


విశాఖ జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆమె గిరిజన తెగకు కాకుండా షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి అంటూ టీడీపీ నేత గుమ్మడి సంధ్యారాణి హైకోర్టులో వేసిన పిటిషన్ అడ్మిట్ అయింది. ఈ నెల 31న (రేపు) కోర్టుకు హాజరు కావాలని గీతను ఆదేశించింది. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన అరకు నుంచి వైకాపా తరపున గీత గెలుపొందారు. ప్రస్తుతం ఆమె టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News