: పారిశ్రామికవేత్త జీవీకేకు మాతృ వియోగం
ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీ కృష్ణారెడ్డి మాతృమూర్తి రుక్మిణమ్మ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. నిండు జీవితాన్ని అనుభవించిన ఆమె... 99 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.