: ఏపీ ఉద్యోగులకు నేటి నుంచి హెల్త్ కార్డులు


పదేళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. ఏపీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి హెల్త్ కార్డులను జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. రూ. 2 లక్షల సీలింగ్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైద్య ఖర్చు ఎంతైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని తెలిపారు.

  • Loading...

More Telugu News