: రమాదేవి మృతికి సంతాపం తెలిపిన ప్రముఖులు
మాజీ గవర్నర్ వీఎస్ రమాదేవి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. రమాదేవి హఠాన్మరణం పట్ల రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఇతర టీడీపీ నేతలు సుజనా చౌదరి, హరికృష్ణ, నామా నాగేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు. గవర్నర్ గానూ, తొలి మహిళా ఎన్నికల ప్రధాన అధికారిణిగానూ విధులు నిర్వర్తించిన ఆమె తెలుగు వారికి గర్వకారణమైందని నేతలు పేర్కొన్నారు.