: మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాట్లు
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ ప్రత్యేకంగా వేదికను రూపొందిస్తున్నారు. ఈ మేరకు దేశాయ్ మాట్లాడుతూ, "350 ఏళ్ల కిందట మహారాష్ట్రలోని రాయ్ ఘడ్ లో జరిగిన తొలి పట్టాభిషేకం జరిగిన పద్ధతిలో ఈ వేడుకను ప్లాన్ చేస్తున్నాం. అంతేకాక నూతన మహారాష్ట్ర రూపొందిన విధానాన్ని కూడా చూపించనున్నాం" అని దేశాయ్ తెలిపారు. ఈ నెల 31న జరిగే ఈ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేతలు, పలువురు అతిథులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సహా దాదాపు ముప్పైవేలమంది వరకు హాజరువుతారని భావిస్తున్నారు.