: ఫిట్ నెస్ కోసం ప్రయత్నిస్తున్నారా... అయితే, ఎంత కష్టపడ్డారో ఇలా తెలుసుకోండి!
వయసుతో సంబంధం లేకుండా అందర్లోనూ ఫిట్ నెస్ పై శ్రద్ధ పెరుగుతోంది. దీంతో, గూగుల్ వినియోగదారుల కోసం ఓ యాప్ ను విడుదల చేసింది. 'గూగుల్ ఫిట్' పేరిట విడుదలైన ఈ యాప్ ఫిట్ నెస్ కోసం మీరు చేసే కసరత్తుల వివరాలను ఓ గ్రాఫ్ సాయంతో చూపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లో ఉపయోగించే వీలున్న ఈ యాప్, ఫోన్లోని సెన్సర్ల ద్వారా రోజువారీ నడక, పరుగు, సైక్లింగ్ వంటి పనులను గుర్తించగలదు. దీంతో, మనం ఫిట్ నెస్ కోసం ఎంత సమయం కేటాయిస్తున్నామో, ఎంత కష్టపడుతున్నామో సూచిస్తుంది. గూగుల్ ఫిట్ యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 4.0 ఐస్ క్రీమ్ శాండ్విచ్ వెర్షన్ లలో ఈ యాప్ పని చేస్తుంది.