: ఆ బాలికకు 32 పళ్లు కాదు 202
సాధారణంగా ఎవరి నోట్లోనైనా 32 పళ్లు ఉంటాయి. కానీ, గుర్ గావ్ లోని ఓ ఏడేళ్ల బాలిక నోట్లో అసాధారణంగా పెరిగిన 202 పళ్లను ఎయిమ్స్ వైద్యులు తొలగించారు. నోటిలో నొప్పి వస్తోందని చెప్పడంతో బాలిక తండ్రి ఆమెను ఎయిమ్స్ కు తీసుకువచ్చాడు. డాక్టర్ అజయ్ రాయ్ చౌదరి బాలిక నోటిని ఎక్స్ రే తీసి చూసి ఆశ్చర్యపోయారు. బాలిక నోట్లో పళ్లతో కూడిన గడ్డ కనిపించింది. దీంతో, ఎయిమ్స్ లోని దంతవైద్యుల బృందం బాలికకు ఆపరేషన్ చేసి 202 పళ్లను తొలగించింది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న వైద్యులు మాట్లాడుతూ, కొంత మందిలో ఇలా అసాధారణంగా పెరిగిన దంతాలను చూస్తుంటామని, అయితే, ఏడేళ్ల పాప నోట్లో ఇంత పెద్ద సంఖ్యలో దంతాలను చూడడంతో ఆశ్చర్యపోయామని అన్నారు. వీటిని తొలగించేందుకు రెండు గంటల సమయం పట్టిందని వారు తెలిపారు. మూడు నెలల క్రితం ముంబైలోని ఓ బాలుడి నోట్లోంచి 232 పళ్లను తొలగించిన సంగతి తెలిసిందే.