: ఇంటర్నెట్ వినియోగదారులకు ఈ రోజు స్పెషల్ డే


ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇంటర్నెట్ ఓ భాగమైపోయింది. మెయిల్ నుంచి సోషల్ మీడియా వరకు, షాపింగ్ నుంచి ఛాటింగ్, పుస్తకాల నుంచి పీడియాల వరకు అన్నీ ఇంటర్నెట్ లోనే చూసుకుని మురిసిపోతున్నాము. నేడు ఇంటర్నెట్ వినియోగదారులకు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే, అక్టోబర్ 29వ తేదీని ఇంటర్నెట్ డే గా జరుపుకుంటున్నారు. 1969 అక్టోబర్ 29న అంటే సరిగ్గా ఇదే రోజు ఓ ఎలక్ట్రానిక్ మెసేజ్ ద్వారా ఇంటర్నెట్ ప్రస్థానం ప్రారంభమైంది. లాస్ ఏంజెల్స్ లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్ క్లెయినార్క్ పర్యవేక్షణలో, పక్క పక్కనే ఉన్న రెండు కంప్యూటర్లను అర్పానెట్ ద్వారా అనుసంధానించి, తొలి సందేశాన్ని విజయవంతంగా పంపి ఇంటర్నెట్ సేవలకు పునాది వేశారు. తొలి రోజుల్లో ఇంటర్నెట్ ను వినియోగించి ఈ విజయం సాధించినందుకు గుర్తుగా అప్పటి నుంచి ఈ రోజును అంతర్జాతీయ ఇంటర్నెట్ డేగా జరుపుకుంటున్నారు. ఆ విధంగా నేడు ఇంటర్నెట్ వినియోగదారులందరికీ ప్రత్యేకమైన రోజు.

  • Loading...

More Telugu News