: సినీ నటి శ్వేతాబసుకు ఊరట
సినీ నటి శ్వేతాబసు ప్రసాద్ కు హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెస్క్యూ హోం నుంచి ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. రెండు నెలల క్రితం వ్యభిచారం కేసులో శ్వేత పట్టుబడిన సంగతి తెలిసిందే. ఇటీవల కుమార్తెకు బెయిల్ ఇవ్వాలంటూ శ్వేత తల్లి ఎర్రమంజిల్ కోర్టును ఆశ్రయించింది. అందుకు కోర్టు తిరస్కరించడంతో నాంపల్లి న్యాయస్థానానికి వెళ్లారు.