: ఐదు వేళ్లకు 8 ఉంగరాలు ధరించి సస్సెన్షన్ కు గురైన యూపీ అధికారి


ఉత్తరప్రదేశ్ విద్యాశాఖలో పనిచేస్తున్న రాజ్ మణి మిశ్రాను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మహబూబ్ అలీ సస్పెండ్ చేశారు. ఎందుకో తెలుసా? ఐదు వేళ్లకు ఎనిమిది ఉంగరాలను ధరించినందుకట! బారాబంకీ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మిశ్రా అధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి అలీ, ఆ జిల్లాలోని ప్రభుత్వ విద్యాలయాల తనిఖీకి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతున్న మంత్రి దృష్టి మిశ్రా ఉంగరాలపై పడింది. అంతే, 'నీ నెలసరి వేతనమెంత?' అంటూ మంత్రి, మిశ్రాను ఆరా తీశారు. ఆ వెంటనే ‘ఐదు వేళ్లకు ఎనిమిది ఉంగరాలు పెట్టావు. నీవు అవినీతి పరుడివే’ అంటూ అలీ, మిశ్రాపై ఊగిపోయారట. అంతటితో ఆగని మంత్రి, మిశ్రాను సస్పెండ్ చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. దీనిపై స్పందించిన మిశ్రా ‘ఇలా ఐదు వేళ్లకు ఇన్నేసి ఉంగరాలు పెట్టుకుంటే ఇలా జరుగుతుందనుకోలేదు’ అని వాపోయాడు.

  • Loading...

More Telugu News