: బీజేపీ అధికారం చేపట్టడంతో మతోన్మాదం పెరిగింది: సురవరం
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తరువాత దేశంలో మతోన్మాదం పెరిగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు మందలించేంత వరకు దేశాన్ని దోచుకున్న నల్లకుబేరుల జాబితాను అందజేయకపోవడం అంటే కార్పొరేట్ శక్తులకు సహకరించడం కాదా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వామపక్షాల ఐక్యత కోసం వచ్చే నెలలో ఐక్యతా సదస్సు నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు.