: వైద్య, ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామంటున్న రాజయ్య
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య నిజామాబాద్ లో మాట్లాడుతూ, వైద్య, ఆరోగ్య శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులన్నింటినీ ఆధునికీకరిస్తామని ఆయన తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యులు విధులు నిర్వర్తించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోని ప్రతి ఆసుపత్రిలో కుక్క, పాము కాటుకు మందులు అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.