: బాబ్లీ ప్రాజెక్టు గేట్లు మూత


గోదావరి నదిపై ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు బుధవారం మూతపడ్డాయి. దీంతో, ఇకపై తెలుగు రాష్ట్రాలకు గోదావరి జలాల విడుదల నిలిచిపోయినట్లే. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూన్ 1న తెరిచిన గేట్లను బుధవారం కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు మూసివేశారు. తిరిగి మార్చి 1న ఈ గేట్లను తెరుస్తారు. ఆ సమయంలో బాబ్లీలో నీరుంటేనే తెలుగు రాష్ట్రాలకు నీరందే అవకాశాలున్నాయి. బాబ్లీలో నీరు లేకుంటే గేట్లు తెరిచినా ప్రయోజనం శూన్యమే.

  • Loading...

More Telugu News