: పోస్ట్ చేసిన రోజే డెలివరీ: కొత్త సేవలకు తపాలా శాఖ శ్రీకారం


ఇంటర్నెట్ సేవల రంగ ప్రవేశంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తపాలా శాఖ బుధవారం సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ‘సేమ్ డే డెలివరీ’ పేరిట పోస్ట్ చేసిన రోజే ఉత్తరాలను బట్వాడా చేసే పథకాన్ని హైదరాబాద్ లో ప్రారంభించింది. చిక్కడపల్లి పీఎన్ టీ కాలనీలోని తపాలా కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సేవల కోసం ఉద్దేశించిన మూడు వ్యాన్ లను తపాలా శాఖాధికారులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం జంట నగరాలకే పరిమితం కానున్న ఈ తరహా సేవలను రానున్న రోజుల్లో ఏపీ సర్కిల్ లోని అన్ని పట్టణాలకు విస్తరించనున్నట్లు ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బీవీ సుధాకర్ తెలిపారు. స్పీడ్ పోస్ట్ ఉత్తరాలను కూడా ఇకపై పోస్ట్ చేసిన రోజే బట్వాడా చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News