: రోడ్లను శుభ్రం చేసిన నాగం
బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి హైదరాబాద్ గన్ ఫౌండ్రీ వద్ద రోడ్లను శుభ్రం చేశారు. బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆయన చీపురు పట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఈ సందర్భంగా నాగం కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.