: అరగంటలో నిర్ణయం చెప్పండి: జూడాలకు హైకోర్టు డెడ్ లైన్
వైద్య సేవలపై పెను ప్రభావం చూపుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మెపై బుధవారం ఉదయం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరగంటలోగా సమ్మె విరమిస్తారో, లేదో చెప్పాలని జూడాలకు హైకోర్టు డెడ్ లైన్ విధించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇదిలా ఉంటే సమస్యల పరిష్కారంపై హామీ లభించే దాకా సమ్మె విరమించేది లేదని జూడాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూడాలపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.