: రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగుకు సుప్రీం సుముఖత
రెండో దశ ఇంజనీరింగ్ కౌన్సెలింగుకు అంగీకరిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో నవంబర్ 15 నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని కళాశాలలను ఆదేశించింది. 2013-14లోని తెలంగాణకు చెందిన అనుబంధ కళాశాలలకే కౌన్సెలింగ్ వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, స్లైడింగుకు ఏమాత్రం అవకాశం లేదని స్పష్టం చేసింది. రెండు రోజుల కిందటే కౌన్సెలింగుకు అంగీకారం తెలిపిన కోర్టు... నవంబర్ 14లోపు కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలో విద్యా సంవత్సరానికి సంబంధించి కళాశాలలు సమర్పించిన షెడ్యూలుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.