: సుప్రీంకోర్టుకు చేరిన నల్లధనం ఖాతాదారుల జాబితా
నల్లధనం ఖాతాదారుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టుకు సమర్పించింది. మొత్తం మూడుసెట్ లతో కూడిన జాబితాను సీల్డు కవరులో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు ఇచ్చారు. జాబితాలో మొత్తం 627 మంది పేర్లు ఉన్నాయి. మొదటి సెట్ లో కేంద్రం దగ్గర ఉన్న జాబితా, రెండో సెట్ లో విదేశాల్లో ఖాతా ఉన్న వ్యక్తుల వివరాలు, మూడో సెట్ లో ఇప్పటివరకు చేపట్టిన విచారణ వివరాలు ఉన్నాయి. కేంద్రం సమర్పించిన జాబితాలో 2006 వరకు ఉన్న స్విస్ బ్యాంకు ఖాతాల వివరాలు ఉన్నాయి. తదుపరి విచారణను డిసెంబర్ 3కు వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.