: ఈ నెల 31న మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 31న (శుక్రవారం) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా బీజేపీ అగ్రనేతలందరూ ఈ ప్రమాణస్వీకారానికి హాజరవనున్నారు. 121 మంది శాసనసభ్యులున్న బీజేపీకి శివసేన మద్దతివ్వనుంది. ఈ క్రమంలో పదిహేను రోజుల్లో అసెంబ్లీలో ప్రభుత్వం తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.