: ఆర్టీఏ అధికారులమంటూ జాతీయ రహదారిపై దుండగుల బీభత్సం


రవాణా శాఖ అధికారులమంటూ కొందరు దుండగులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కలపర్రు జాతీయ రహదారిపై బీభత్సం సృష్టించారు. కోల్ కతా నుంచి చెన్నై వెళుతున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు వద్ద ఆపిన ఐదుగురు నిందితులు లారీ డ్రైవర్ పై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. అతడి వద్ద ఉన్న రూ.25 వేలను ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ను మరో లారీ డ్రైవర్ సమాచారంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. నిందితుల కోసం ప్రత్యేక టీంను రంగంలోకి దింపినట్లు ఏలూరు పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News