: కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు


విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. నర్సీపట్నం నియోజకవర్గం బలిఘట్టం వద్ద కార్యకర్తల సమావేశంలో బాబు మాట్లాడుతూ, తొమ్మిదేళ్ళ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యతను టీడీపీ స్వీకరిస్తోందని ఆయన అన్నారు. తమకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సే కానీ, ఇతర పార్టీలు కాదని బాబు స్పష్టం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తాను ఎప్పుడూ హత్యారాజకీయాలకు పాల్పడలేదని బాబు చెప్పారు.

  • Loading...

More Telugu News