: కొణతాల సమస్య ఏంటో తెలుసుకోండి: సుబ్బారెడ్డిని ఆదేశించిన జగన్
వైకాపాలో కీలక నేత అయిన కొణతాల రామకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధినేత స్పందించినట్టు సమాచారం. కొణతాల ఎందుకు రాజీనామా చేశారో తెలుసుకోండని పార్టీ నేత వై.వి.సుబ్బారెడ్డి తదితరులకు జగన్ పురమాయించారు. జగన్ ఆదేశాలతో కొణతాలను సంప్రదించడానికి పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొణతాల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటమే దానికి కారణం. ఏదేమైనప్పటికీ... కొణతాలను సంప్రదించడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలని జగన్ సూచించారు.