: మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే చాలు
మహిళలు రోజూ రెండు కప్పుల టీ తాగితే అండాశయ క్యాన్సర్ బారినపడే అవకాశాలు తక్కువని ఈస్ట్ యాంగ్లియా విశ్వవిద్యాలయం తెలిపింది. మహిళల్లో క్యాన్సర్ కారకాలపై పరిశోధన చేసిన ఆ యూనివర్సిటీ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ఈ పరిశోధనల కోసం 25-55 ఏళ్ల మధ్య ఉన్న 1,71,940 మంది మహిళలను పరిశీలించారు. సుమారు 30 ఏళ్ల నుంచి రోజూ రెండు కప్పుల టీ తాగుతున్న వారిపై ఈ పరిశోధన నిర్వహించారు. రెండు కప్పుల టీతో పాటు, తాజా పళ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకునే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని నిర్థారించారు.